![]() |
![]() |
.webp)
జీ తెలుగులో "కుటుంబం కిస్మత్ కనెక్షన్స్" పేరుతో త్వరలో ఒక షో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇందులో జాతకాలు చూడడం అనే కాన్సెప్ట్ తో తీసుకొస్తున్నారు. ఇక ఇందులో బుల్లితెర నటీనటులంతా వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రెడిక్షన్స్ ని చెప్పించుకున్నారు. ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, పెళ్లిళ్లు ఎప్పుడవుతాయి వంటి ఎన్నో ప్రశ్నలకు ఆన్సర్స్ ని కూడా ఈ షోలో తెలుసుకున్నారు. ఇందులో నిరుపమ్, మంజుల పరిటాల వచ్చారు. నిరుపమ్ చేతి రేఖలు చూసిన ప్రెడిక్షన్ చెప్పడానికి వచ్చిన మనీష్ అనే అమ్మాయి షాకైపోయింది.
"అసలేంటి ఇన్ని గీతలు ఉన్నాయి" అని అడిగేసరికి "దేవుడు ఎక్స్ట్రా గీతలన్నీ నా చేతిలోనే వేసేశాడు" అని చెప్పాడు నిరుపమ్. తర్వాత మంజుల చేతి రేఖలు చూసి "మేడం చెయ్యి చాలా బాగుంది. ఆవిడ చేతి రేఖలు బాగున్నాయి కాబట్టి మీకు చాల బాగుంది" అని చెప్పింది. తర్వాత చందు గౌడ వచ్చేసరికి "మీరు బుల్లితెర నుంచి వెండి తెర మీదకు అరంగేట్రం చేస్తున్నారు.. "మీకు మీ జీవితంలో ఒక ఖరీదైనది రాబోతోంది" అని చెప్పేసరికి "ఇంకో కొత్త బైక్ కొంటున్నాను" అని చెప్పాడు. ఇక సుమ కనకాల, రాజీవ్ కనకాల ఇద్దరూ వచ్చేసరికి "మీరు ఎం తెలుసుకోవాలని అనుకుంటున్నారు" అని ప్రెడిక్షన్ చెప్పే అమ్మాయి అడిగేసరికి "నెక్స్ట్ జన్మలో నా మొగుడు ఎవరో తెలుసుకుందామని" వచ్చాను అంది సుమ. "ఏడేడు జన్మలకు రాజీవ్ గారే మీ భర్త . ఇంకా కొన్నేళ్ల వరకు మీరే యాంకర్..ఆ బ్రాండ్ మీరు అలా ఫిక్స్ చేసేసారు" అని చెప్పింది ఆ అమ్మాయి మనీష..ఇక రౌడీ రోహిణి జాతకం చూసి ఆమె ఫ్యూచర్ వెలిగిపోతుంది అని చెప్పింది. ఇలా ఈ షో త్వరలో రాబోతోంది. మరి ఈ షో వస్తే ఎవరెవరి జాతకాలు ఏంటో తెలిసిపోతాయి.
![]() |
![]() |